సూపర్‌ ఓవర్‌లో వెస్టీండీస్‌ విజయం

క్యాండీ: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-8లో న్యూజిలాండ్‌, వెస్టీండీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ ప్రేమికులకు మరోసారి టీ 20 మజాను అందించింది. ఇరు జట్ల స్కోర్లు సమంకావడంతో సూపర్‌ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. సూపర్‌ ఓవర్లో మొదట బ్యాటింగ్‌ చేసిన కివీన్‌ 17 పరుగులు చేసింది. రాన్‌టేలర్‌ 15, పరుగులు చేశాడు అనంతరం బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ మరో బంతి మిగిలి ఉండగానే 19 పరుగులు సాధించి అద్భుత విజయాన్ని అందుకుంది. గేల్‌ 8, శ్యామ్యూల్స్‌ 9, పరుగులు చేశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టీండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటయింది. క్రిన్‌గేల్‌ 30, పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా, పొలార్డ్‌ 28, శ్యామూల్స్‌ 24 పరుగులతో రాణించారు. బౌలర్లలో సౌధి, బ్రాన్‌వెల్‌ చెరో మూడు వికెట్లు తీయగా నాథన్‌ మెక్‌ కల్లమ్‌ 2, హిరా ఒక వికెట్‌ తీశారు. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీన్‌ నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌటయింది. రాన్‌టేలర్‌ 62 పరుగులతో పోరాడినా కివీస్‌ను గెలిపించలేకపోయాడు. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. విండీస్‌ బౌలర్లలో నరేస్‌ 3 వికెట్లు తీసుకోగా రాంపాల్‌, బత్రీ, సామి తలో వికెట్‌ తీసుకున్నారు. నరేస్‌ మ్యాన్‌ ఆఫ్‌ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.