సూరారం కాలనీలో దొంగల బీబత్సం

 హైదరాబాద్: నగరంలోని దండగిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సురారంకాలనీలో దొంగలు బీబత్సం సృష్టించారు. లాండ్రీషాపులో పడుకొని ఉన్న సత్యనారాయణపై దాడి చేసి దొంగలు దొరికిన కాడికి ఎత్తుకెళ్లారు. దొంగల దాడిలో గాయపడిన బాధితుడిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దరాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.