సూర్యాపేట సభపై తెదేపా నేతల విమర్శలు

హైదరాబాద్‌: కేసీఆర్‌ సూర్యాపేట సభపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్నటి సభ ద్వారా కేసీఆర్‌ వారి ఆశలను నీరుగార్చారని మండిపడ్డారు. తెలంగాణ కార్యాచరణ పక్కనపెట్టి, ఎన్నికల వాగ్దానాలకే కేసీఆర్‌ పరిమితమయ్యారన్నారు. కేసీఆర్‌కి బతుకుదెరువు పోరాటమే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధనపై ఆరాటం లేదన్నారు. కేసీఆర్‌కు నచ్చినప్పుడే ఉద్యమం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఘూటుగా విమర్శించారు. ఉద్యమం ఉద్థృతంగా నడుస్తున్న సమయంలో ఢిల్లీ వెళ్లి కూర్చుంటారని, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో సభలు నిర్వహిస్తారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని సభలో కేసీఆర్‌ ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.