సెప్టెంబర్ 17వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలి: :శంకర్‌రావు
హైదరాబాద్: తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్‌రావు మంగళవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో పంతాలు పట్టింపులకు పోవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. తన ప్రవర్తనతో సీఎం చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన ఆన్నారు.



