సెప్టెంబర్ 1న చీకటి దినం గా పాటించాలి

 

ఝరాసంగం సెప్టెంబర్ 1 (జనంసాక్షి)ఉద్యోగుల పాలిట శపమైన సిపిఎస్ విధానం సెప్టెంబర్ 1న చీకటి దినం గా పాటించాలి అని యూఎస్ పి సి ఉపాధ్యాయ సంఘాల పోరాటం నాయకులు అన్నారు.గురువారం మండలం లోని చిలపల్లి పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో సి పి యస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత విధానం కొనసాగించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.