సైదాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం…
హైదరాబాద్:తనను యువతి ప్రేమించలేదని ఓ యువకుడు యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం జరిగింది. సైదాబాద్‌లోని వినయ్‌నగర్‌లో ఓ యువకుడు యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో వినయ్‌నగర్‌లో విషాదం అలముకుంది. పోలీసులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తున్నారు.