సైనాకు సీఎం అభినందన

హైదరాబాద్‌ : ఇండోనేషియా ఓపెన్‌ బాల్‌బాడ్మింటన్‌ టైటిల్‌ గెల్చుకున్న  హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను సాధించడం ద్వారా సైనా భారత్‌ పేరు నిలిపిందని ఆయన కొనియాడారు. సైనా మన హైదరాబాద్‌ క్రీడాకారిణి కావడం మనందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.ఈ ఏడాదిలో మూడు టైటిళ్లు సొంతం చేసుకోవడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.