సైనా జీవిత చరిత్ర పుస్తకం అవిష్కరణ
హైదారబాద్ : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వల్ జీవిత విశేషాలతో రచించిన పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించారు.టి. ఎన్. సుధీర్ రచించిన ఈ పుస్తకంలో బ్యాట్మింటన్ క్రీడలో సైనా ఎదిగిన తీరు, చేసిన కృషి, కోచ్‌ల శిక్షణ, సాధించిన విజయాలు, తల్లిదండ్రుల సహకారం తదితర వివరాలన్నీ పొందుపర్చారు. బ్యాట్మింటన్ క్రీడలోకి ప్రవేశించే కొత్త క్రీడాకారులకు ఈ పుస్తకం మార్గదర్శకంగా ఉంటుందని రచయిత సుధీర్ అన్నారు. కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.