సొలొమాన్‌ దీవుల్లో భూకంపం

సిడ్నీ: పసిఫిక్‌ మహాసముద్రంలోని సొలొమాన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. సముద్రతీరానికి 22కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు ఆమెరికా తెలిపింది. దీని ప్రభావంతో సునామీ ఏర్పడే అవకాశం లేదని సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.