సోనియాతో కీలకనేతల సమావేశం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ కీలక నేతలు ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈసమావేశంలో చిదంబరం, ఆజాద్, దిగ్విజయ్ సింగ్, ఆంటోనీ, షిండే, మొయిలీ తదితరులు పాల్గొన్నారు. జైపూర్ మేథోమథనం, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం తెలిసింది.