స్ట్రీట్‌ఫైట్ కేసులో అరెస్టైన నిందితులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్
హైదరాబాద్, మే 12 : స్ట్రీట్‌ఫైట్ కేసులో అరెస్టైన 8మంది నిందితుల తల్లిదండ్రులను పోలీసులు మంగళవారం డీజీపీ కార్యాలయానికి పిలిపించారు. నిందితులకు తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించారు. నిందితులకు మరోరెండు అనుమానాస్పద మరణాల్లోనూ, అరేబియన్‌గ్యాంగ్‌తోనూ సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.