స్తంభించిన బ్యాంకింగ్‌ సేవలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె కొనసాగుతొంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకింగ్‌ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. హైదరాబాద్‌ కోఠిలోని బ్యాంక్‌ స్ట్రీట్‌లో వివిధ బ్యాంకుల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమవడంతోనే సమ్మెకు దిగినట్లు బ్యాంక్‌ ప్రతినిధులు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా బ్యాంకులను ప్రైవేట్‌ పరం చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. బ్యాంకింగ్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించవద్దంటూ డిమాండ్‌ చేశారు. బ్యాంకింగ్‌ రంగం దేశంలో బలపడితేనే అన్ని వర్గాల అభివృద్ధిసాధ్యమవుతుందని చెప్పారు.

తాజావార్తలు