స్పీకర్‌కు నల్లగొండ టీఆర్‌ఎస్‌ నేతల విజ్ఞప్తి

నల్లగొండ : నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లో పర్యటిస్తోన్న రాష్ట్రశాసన సభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు టీఆర్‌ఎస్‌ నేతల వినతి పత్రం అందజేశారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిలిపివేయాలని, నల్లగొండ జిల్లా ప్రజల గొంతు తడపాలని వినతి పత్రం లో కోరారు. ఈ రోజు స్పీకర్‌ నేతృత్వంలో అఖిల పక్ష ఎమ్మెల్యేల బృందం జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిదే.