స్వచ్చతపై ఆలోచింపజేసిన సాంస్కృతిక కార్యక్రమాలు.

అభినందించిన మంచిర్యాల జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ.
– స్వచ్చత మన జీవితంలో అంతభాగం కావాలన్న ఎలక్టికల్ ఏఈ రాం మోహన్
పోటో: సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్.
బెల్లంపల్లి, సెప్టెంబర్10,(జనంసాక్షి)
స్వచ్చ గురుకుల్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ బెల్లంపల్లిలో నిర్వహిచిన ఫ్లాష్ మోబ్ (ప్రత్యేక సమావేశం) విద్యార్ధులు స్వచ్చత అవసరాన్ని తెలుపుతూ ప్రదర్శించిన నేను నీకు తోడు నాటిక ఆలోచింపజేసింది. అదేవిధంగా 5వ తరగతి విద్యార్ధులు స్వచ్చతపై వ్రాసి ఆలపించిన గేయాలు, నినాదాలు అలరించాయి. హాజరైన విద్యార్ధుల తల్లిదండ్రులతో కలిసి ఉపాధ్యాయులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు గత వారం రోజులుగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలగురించి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన మంచిర్యాల జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ మాట్లాడుతూ సిఓఈ విద్యార్ధులు చదువుల్లో ప్రతిభచూపిస్తారని విన్నాననీ, ఈ రోజు వారు స్వచ్చతకార్యక్రమాన్ని ఒకసామాజిక ఆవశ్యకతగా తమ నాటికలో చూపించి ఆకట్టుకున్నారని అభినందించారు. ఉత్తమ ఫలితాలతో జాతీయస్థాయిలో బెల్లంపల్లికి మంచి గుర్తింపు తీసుకొస్తున్న మరింత సహకారం అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిధి బెల్లంపల్లి రూరల్ ఎలక్ట్రికల్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ రాం మనోహర్ మాట్లాడుతూ స్వచ్చత మన జీవితంలో అంతర్భాగం కావాలన్న, గురుకులాల లక్ష్యం ఉన్నతమైన ఆలోచన అన్నారు.ఆదిశగా బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధులు చేస్తున్న పలుకార్యక్రమాలు తల్లిదండులనేకాక స్థానిక అధికారులను ప్రజాప్రతిబిధులను సైతం ఆలోచింప జేస్తున్నాయన్నారు. ఈకార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు దాగం మహేష్, మహేంధర్, తల్లిదండ్రులు, ఇప్ప అశోక్, జాడి రాజమని, కళ్యాణి, దాగం మల్లేష్, మూడ్ నారాయణ, తీగల శ్రీనివాస్, కర్రె రాజేష్, దుర్గం శారద, వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, జెవిపి దాసం అజిత, అధ్యాపకులు నాగినేని శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, ఆకినేపల్లి రాజేష్, గాజుల రాజేందర్, చందా లక్ష్మీనారాయణ, కట్ల రవీందర్, అనుముల అనిరుద్, సజ్జనపు విజయ్, అవునూరి రవి, గోమాస చంద్రశేఖర్,వరమణి ప్రమోద్ కుమార్, భోగ అశోక్, తదితరులు పాల్గొన్నారు.