స్వదేశీ పరిజ్ఞానంతో లక్ష్య-1 విజయవంతం

బాలాసోర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫైలట్‌రహిత, సూక్ష్మ తేలికపాటి విమానం లక్ష్య-1ను గురువారం చాందీపూర్‌ వద్ద విజయవంతంగా ప్రయోగించి చూశారు. డిజిటల్‌ వ్యవస్థ ద్వారా నియంత్రించే ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఫైలట్‌ రహిత విమానం వైమానిక దళం సిబ్బంది శిక్షణలో లక్ష్యంగా ఉపయోగపడుతుంది.