స్వాతంత్య్రం రావడానికి స్ఫూర్తి క్విట్‌ ఇండియా ఉద్యమం ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్‌

నిజామాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్‌ గురువారం ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ స్వాతంత్య్రం రావడానికి స్ఫూర్తియే క్విట్‌ ఇండియా ఉద్యమమని తెలిపారు.  1942 ఆగస్టు 9 జాతిపిత మహాత్మగాంధీ క్విట్‌ ఇండి యా ఉద్యమాన్ని చేపట్టారని ఈ ఉద్యమమే భారత స్వాతంత్య్రనికి పునాధిగా మారిందని గాంధీ విజయమో వీర స్వర్గమో అంటూ స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీజీ ఊపిరి పోశాడని దేశ వ్యాప్తంగా క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. ఎందరో త్యాగధనులఫలితంగా సంపాదించుకున్న స్వాతంత్య్రాన్ని మనంకాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌, డిచ్‌పల్లి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, పీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్‌, కాంగ్రెస్‌ నగరాధ్యక్షుడు కేశవేణు, శరత్‌, నగర యూత్‌ అధ్యక్షుడు బంటురాము, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.