హంగ్‌కాంగ్‌లో నిరసనల వెల్లువ

హంగ్‌కాంగ్‌: హంగ్‌కాంగ్‌లో ఆదివారం వేల మంది ఆందోళనకారులతో దద్దరిల్లింది. ఆంగ్లేయుల పాలన నుంచి ఈ కేంద్రపాలిత ప్రాంతానికి విముక్తి లభించి 15 ఏళ్లయిన సందర్భంగా ఆందోళనకారులు విధుల్లోకి వచ్చారు. చైనా పాలనలో తమకు ప్రయోజనం ఏమి లేదని, ఇక్కడ పాక్షిక ప్రజసౌమ్యం, అసమానత్వం రాజ్యమేలుతున్నాయని నినాదాలు చేశారు.  చైనా పాలనకు సన్నిహితుడైన స్థిరాస్తి వ్యాపారి లియుంగ్‌చున్‌-యింగ్‌ను హంగ్‌కాంగ్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమించడానికి వ్యతిరేకత వ్యక్తం చేశారు. చైనా అధ్యక్షుడు హు జింటవొ సమక్షంలో లియింగ్‌ పదవి ప్రమాణంస్వీకారం చేస్తుండగా జింటవొ ప్రసంగన్ని ఓ  ఆందోళనకారుడు ఆడ్డుకున్నాడు. అతన్ని భధ్రత సిబ్బంది బలవంతగా బయటకు పంపిచారు.తమ హక్కులు ప్రమాద అంచుకు చేరుకున్నాయాని పెర్కున్నారు. చైనాలోని కమ్యూనిస్టు ఈ హంగ్‌కాంగ్‌ను నాశనం చేస్తుందని ఆరోపించారు.