హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌కు చెందిన హక్కానీ నెట్‌వర్క్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ గా గుర్తించాలని అమెరికా ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.ఆల్‌ఖైదాకు అనుబందంగా పనిచేస్తున్న ఈ సంస్థను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఒబామా ప్రభుత్వం మరింత ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. హక్కానీ నెట్‌వర్క్‌ను ఎఫ్‌టీవోగా గుర్తించాలని ప్రభుత్వానికి సూచిస్తూ ప్రతినిధుల సభ మంగళవారం ఒక బిల్లును ఆమోదించింది. ఆప్గానిస్థాన్‌లో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తూ బిల్లును ఆమోదించింది. ఆప్గానిస్థాన్‌లో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తూ హక్కానీ నెట్‌వర్క్‌ అనేక అరాచక చర్యలకు పాల్పడింది. ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలని అమెరికా కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ పాకిస్థాన్‌ ప్రభుత్వం వెనుకాడుతోంది.