హత్ సే హత్ రేవంత్ రెడ్డి జూడో యాత్రలో అపశృతి.     కాన్వాయ్ లో ఢీకొన్న వాహనాలు.

తృతిలో తప్పిన ప్రమాదం. పాత్రికేయులకు స్వల్ప గాయాలు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 4 (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న హత్ సే హత్ రేవంత్ రెడ్డి జూడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గంభీరావుపేట్ మండలం తిమ్మాపూర్ సమీపంలో తొమ్మిదవ ప్యాకేజీ పనులను  పరిశీలించేందుకు వెళ్లిన క్రమంలో తిమ్మాపూర్ సమీపంలో కాన్వాయ్ లోని వాహనాలు డీ కొట్టుకున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో స్వల్ప గాయాలతో పలువురు వీరిలో పాత్రికేయులు కూడా ఉన్నారు.నాలుగు వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.