హన్మకొండలో అగ్నిప్రమాదం :15 కార్లు దగ్ధం

వరంగల్‌ : హన్మకొండలోని నక్కలగుట్టలో సోమవారం సాయంత్రం ఓ కార్ల షెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆ షెడ్డులో ఉన్న సుమారు 15 కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంలో పెట్రోల్‌ బంక్‌ ఉంది. మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల షాపుల వారు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న నగర ప్రజలు అక్కడికి తరలి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది .ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.