హరికృష్ణ మృతికి పోచారం సంతాపం

హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణం బాధ కలిగిస్తోందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడి అన్నారు. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం పోచారం మాట్లాడుతూ..చైతన్యరథంపై హరికృష్ణ వేల కిలోవిూటర్లు తిరిగారని, వేల కిలోవిూటర్లు తిరిగినా చైతన్య రథానికి ఎలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. పార్టీలో ఉన్నపుడు ఆయన ఎంపీ లాడ్స్‌ నిధులు ఇచ్చారని పోచారం గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయానికి రోడ్డు కోసం రూ.10 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. తిమ్మాపురం వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లేందుకు సిమెంట్‌ రోడ్డు వేయడానికి నిధులచ్చిన తొలి వ్యక్తి హరికృష్ణ అని మంత్రి తెలిపారు. గుడికి మట్టి రోడ్డు ఉందని, సిమెంట్‌ రోడ్డు వేద్దామని చెప్పిన వెంటనే తన ఎంపీ కోటా నుంచి రూ. 10 లక్షలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. హరికృష్ణ మరణం తెలియడంతో కన్నీరు ఆగలేదు. హరికృష్ణ మరణం దు:ఖాన్ని మిగిల్చింది. హరికృష్ణ ఒక మంచి వ్యక్తి. చాలా మంచి హృదయం. విశాలమైన ఆలోచన. అటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధాకరం అని అన్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని వేడుకుంటున్నా. ఆయన కుటుంబసభ్యులను తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.మోహన్‌బాబు సంతాపంతమ్ముడు హరికృష్ణ మరణ వార్త దిగ్భాంతికి గురిచేసిందని నటుడు మోహన్‌ బాబు తెలిపారు. తనకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు మా అన్నగారి బిడ్డ అని చెప్పారు. డ్రైవర్‌ రాముడు చిత్రం నుంచి మా మధ్య అనుబంధం ఈ నాటికీ కొనసాగుతూనే ఉందని, సీతయ్య ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు. తాను ఇండియాలో లేనని, ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని పేర్కొన్నారు.