హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.

కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన- బట్టా విజయ్ గాంధీ
బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) భావి భారత ప్రధాని అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రకి స్ఫూర్తిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టి పి సి సి) నేతృత్వంలో తెలంగాణా వ్యాప్తంగా కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను విజయవంతం చేసిన కాంగ్రెస్ శ్రేణులకు పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ యువ నేత బట్టా విజయ్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, భద్రాచలం శాసనసభ్యులు పొదేం వీరయ్య  ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గంలో వేలాదిమందితో దండుకట్టి విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షుడు, మండల కమిటీ యంత్రాంగం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులకు, ప్రజలకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలోని సీతారాం పురం నుంచి మణుగూరు పాదయాత్ర, భద్రాచలం నియోజకవర్గం పాదయాత్ర, మీటింగ్ కార్నర్ కి స్వచందంగా హాజరై అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి వెంట అడుగులు కలిపిన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు