హాస్టల్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఖమ్మం, ఆగస్టు 3 : ఖమ్మం పట్టణంలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇంత వరకు సమస్యలు పరిష్కరించడంలేదన్నారు. వసతి గృహాలలో కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేదన్నారు. విద్యార్థులు ఉండడానికి కనీసం సొంత భవనాలు లేక విద్యార్థులు ఇరుకు గదుల్లో మగ్గుతున్నారన్నారు. హాస్టళ్లలో పర్మినెంట్‌ వర్కర్స్‌, వార్డెన్లు లేక విద్యార్థులే వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.