హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో భారీ పేలుళ్లు

భువనేశ్వర్‌: కోరావుట్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఈరోజు ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిలో ముగ్గురు అధికారులు, మరో ముగ్గురు సాంకేతిక సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హెచ్‌ఏఎల్‌ సునాబెడ్‌ ఆస్పత్రికి తరలించారు.