హెచ్‌డిఎఫ్‌సి వారంట్లకు పెరిగిన గిరాకీ

న్యూఢిల్లీ, జూలై 5: ప్రైవేట్‌ బ్యాంకర్‌ అయిన హెచ్‌డిఎఫ్‌సి కన్వర్టిబుల్‌ వారంట్లకు గిరాకీ ఏర్పడింది. సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇవి రూ.68.20 వద్ద విక్రయం అయ్యాయి. జూన్‌లో దీని ధర రూ.36.60 మాత్రమే. అంటే 86 శాతం ధర పెరిగిందని బ్రోకర్లు చెప్పారు. అందులో సౌలభ్యం ఏమంటే ఈ వారంట్లను హెచ్‌డిఎఫ్‌సి షేర్లుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈషేర్లు ఒక్కోటి రూ.600 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అంతకు ముందు రూ.672 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. అంటే రూ.72 ధర పడిపోయింది. అయినప్పటికీ వారంట్లను షేర్లుగా మార్చుకుంటే సుమారు 600 శాతం లాభం వస్తుంది. అందువల్ల వారంట్లకు గిరాకీ పెరిగింది.