హెల్త్ వర్సిటీ పాలకమండలి సమావేశం రేపు
విజయవాడ,జనంసాక్షి : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలకమండలి 207వ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ఏప్రిల్‌లో జరగనునన 17వ స్నాతకోత్సవంపై చర్చించనున్నారు. గౌరవ డార్టరేట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. 2013-14 విదాంమ సంవత్సరంలో నిర్వహించే పీజీ మెడికల్ కౌన్సెలింగ్, దీనికి సంబంధించి ఇటివల ప్రభుత్వం జారీచేసిన జీవో గురించి చర్చించనునారు. ఈ ఏడాది పెంచిన కళాశాలల అఫిలియేషన్ ఫీజులను తగ్గించాలని కోరుతూ ఆయా కళాశాలను ఇచ్చిన వినతులపైన, యూనివర్సిటీలో కొత్తగా ఏర్పడిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డెరైక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ పోస్టులకు ఎంత వేతనాలు ఇవ్వాలనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.