హైకోర్టులో రెండో రోజు నిరసన
తెలంగాణ కోర్టుల్లో ఆంధ్ర న్యాయమూర్తుల నియామకాన్ని నిరసిస్తూ రెండో రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలో తెలంగాణ న్యాయవాదులు లంచ్ అవర్ డెమాన్ స్ట్రేషన్ చేపట్టారు. సీమాంధ్ర నేతలు, న్యాయమూర్తుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం నుంచి హైకోర్టులో కూడా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.