హైకోర్టు తీర్పు మంచి నిర్ణయం: ఎమ్యేల్సీ వై. బి. రాజేంద్రప్రసాద్‌

విజయవాడ: స్థానిక సంస్థలకు ఎన్నికలను జరిపించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం మంచి నిర్ణయమని తెదేపా ఎమ్మెల్సీ వై.బి. రాజేంద్రప్రసాద్‌ విజయవాడలో అన్నారు. ఇప్పటి వరకూ ప్రత్యేకధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్ల పనులు అగిపోయాయని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలు జరపాలన ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.