హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
– మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ జనం సాక్షి , మంథని : టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం మంథనిలో ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ కుంభకోణం పై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.