హైటెక్‌ కాపీయింగ్‌ కేసులో నిర్మాత అరెస్టు

హైదరాబాద్‌ : చండీఘర్‌ మెడికల్‌ పీజీ ప్రవేశపరీక్షల్లో బయటపడిన హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న తెలుగు సినీనిర్మాత కోట గంగాధర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నందమూరి తారకరత్న హీరోగా నందీశ్వరుడు అనే సినిమాను ప్రారంభించారు. ఇతను ఇంతకుముందు ఎంసెట్‌లో కూడా కాపీయింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఆ డబ్బుతోనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడని తెలిసింది. ఇతను శ్రీకాళహస్తికి చెందినవాడని, ప్రస్తుతం గాంధీ మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ చదువుతున్నాడని సమాచారం. ఎప్పటికైనా శ్రీకాళహస్తిలో ప్రాక్టీస్‌ పెట్టడం తన ఆశయమని సన్నిహితుల వద్ద చెబుతుంటాడని తెలిసింది. గురివిరెడ్డి అనే మిత్రుని సహకారంతో గంగాధర్‌రెడ్డి కాపీయింగ్‌ కుంభకోణాలు నడుపుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎలాగైనా మెడికల్‌ సీట్లు సంపాదించాలనుకునే వారిని పట్టుకొని వీరు బేరాలు నడినట్లు తర్వాత ఆ విద్యార్థులకు ప్రశ్నపత్రాలను స్కాన్‌ చేసే ప్రత్యేక కళ్లద్దాలు, జవాబులు వినడానికి బ్లూటూత్‌ పరికరాలు ఇచ్చి హైటెక్‌ పద్ధతిలో కాపీయింగ్‌ చేయిస్తారని, హైదరాబాద్‌లో ఉండే ఎక్కడికైనా జవాబులు పంపడం వీరి ప్రత్యేకత.

తాజావార్తలు