హైదరబాద్‌లో 100మంది హిజ్రాల అరెస్ట్‌

హైదరాబాద్‌: నగరంలోని ఎంఎంటీఎస్‌ రైళ్లలో వేధింపులకు పాల్పడుతున్న 100మంది హిజ్రాలు, పోకిరీలను ఆర్పీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణీకుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రయాణీకుల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నవారితో పాటు, మహిళలను వేధించే వారిని కూడా అరెస్టు చేసినట్లు ఆర్పీఎఫ్‌ తెలిపింది.