హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద:  నగరంలోని జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌ సమీపంలో ఓ హోటల్‌లో బుధవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా వ్యాపించడంతో హోటల్‌లోని ఫర్నిచర్‌ అంతా  పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను  చల్లరగోటారు. ప్రమాదానికి గల కారణాలు సమాచారం తెలియలేదు.