హైదరాబాద్‌లో కల్లు గీత కార్మికుల ధర్నా

హైదరాబాద్‌: ఉపాధి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కల్లు గీత కార్మికులు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు వివిధ జిల్లాల నుంచి కల్లు గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరి ఆందోళనకు తెదేపా మద్దతు తెలుపుతూ ఆ పార్టీ సీనియర్‌ నేత ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ విమర్శించారు. వృద్ధాప్య పింఛను, ఎక్స్‌గ్రేషియా బకాయిల చెల్లింపు ఉపాధి రక్షణ వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.