హైదరాబాద్‌లో దొంగల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కిలో బంగారం, నాలుగున్నర లక్షల రూపాయల నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అలీ మహ్మద్‌, మహ్మద్‌ రీషీద్‌, మహ్మద్‌ ఎజాజ్‌ ఓ ముఠాగా ఏర్పడి హెచ్‌ఎంటీ నగర్‌లోని సాయిదుర్గ అపార్ట్‌మెంట్‌లో 180 తులాల బంగారం, నాలుగున్నర లక్షల రూపాయలు దొంగిలించారని నాచారం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.