హైదరాబాద్‌లో ధనత్రయోదశి సందడి

హైదరాబాద్‌: సోమవారం ధనత్రయోదశి సందర్భంగా హైదరాబాద్‌లోని బంగారు దుకాణాల్లో సందడి నెలకొంది. ధన త్రయోదశిని పురస్కరించుకుని ఎంతోకొంత బంగారం కొంటే మంచిదని విశ్వసించే ప్రజలు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. రద్దీని తట్టుకోవడానికి ఉదయం నుంచే వర్తకులు పసిడి అమ్మకానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పలు దుకాణ యజమానులు వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ సెంటిమెంట్‌నే బలంగా విశ్వసిస్తూ మహిళలు ధన్‌తేరన్‌ సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. మదుపరులు బంగారం బిస్కట్ల రూపంలో కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. గతేడాదితో పోలీస్తే ఈసారి పెరిగిన ధరల ప్రభావంతో కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు నిరాశ  చెందుతున్నారు.