హైదరాబాద్‌లో నల్లగొండ డీఆర్సీ మీటింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ దెబ్బకు నల్లగొండ డీఆర్సీ మీటింగ్‌ హైదరాబాద్‌లోని లేక్‌వ్యూగా గెస్ట్‌హౌజ్‌కి మారింది. జిల్లాలో అడుగుపెడితే తెలంగాణ విషయం ఎక్కడిదాక వచ్చిందని జనం నిలదీస్తరన్న భయంతో అధికారులను మంత్రులు హైదరాబాద్‌ పిలిపించుకున్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సునిత లకాష్మరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. దీనిపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడగానికి వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతామని జనం నేతలను హెచర్చిరిస్తున్నా.