హైదరాబాద్‌లో బీజెపి దీక్ష..లోక్‌సత్తా ఆందోళన

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : బిజెపి మహిళా మోర్చా 24 గంటల నిరాహారదీక్షను ఇందిరాపార్కు వద్ద బుధవారంనాడు నిర్వహించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కిషన్‌రెడ్డి ప్రసంగించారు.

లోక్‌సత్తా ఆధ్వర్యంలో..
సోమాజీగూడలోని విద్యుత్‌ సౌధ వద్ద బుధవారంనాడు లోక్‌సత్తా ధర్నా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పై రాకపోకలను నిషేధించారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించివేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.