హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు.. రూ.74.18పైసలు..

న్యూఢిల్లీ, జనవరి 16:పెట్రోలు లీటరు ధర మళ్లీ పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో పెట్రోలు లీటరు ధర 35 పైసలు పెంచినట్టు చమురు కంపెనీలు తెలిపాయి. ఢిల్లీలో లీటరు ధర రూ.67.56పైసలకు చేరింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అన్ని పనులు కలుపుకుని 45పైసలు పెరిగింది. రూ.73.73పైసలు ఉన్న లీటరు ధర తాజాగా రూ.74.18పైసలకు చేరుకుంది. అలాగే విజయవాడలో రూ.73.28పైసలకు, వరంగల్‌లో రూ.73.37పైసలైంది. ఇదిలా ఉండగా పెట్రోలు లీటరు ధరను గతేడాది అక్టోబర్‌లో 56పైసలు, నవంబరులో 96పైసలు వంతున తగ్గించిన విషయం తెలిసిందే.