హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడిగా జి.వినోద్‌
హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జి.వినోద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెంటకపతిరాజు, వెంకటరామిరెడ్డి, శివలాల్‌యాదవ్‌, విద్యుత్‌ జయసింహ, యాదగిరి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా శ్రీధర్‌, సంయుక్త కార్యదర్శిగా వెంకటేశ్వరన్‌, కోశాధికారిగా నరేశ్‌ శర్మ గెలుపొందారు.