హైదరాబాద్ లోని విద్యానగర్ లో ఎస్‌బీఐ కొత్త శాఖ
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాదులోని విద్యానగర్ ప్రాంతంలో ఉన్న దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కాలనీలొ కొత్త శాఖను ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాకేశ్ శర్మ దీనిని ప్రారంభించారు. ఈ శాఖలో లాకర్ సౌకర్యం కూడా ఉందని వారు చెప్పారు. ఖాతాదారులకు మరింతగా చేరువయ్యేందుకు అన్ని ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటుచేస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.