హైదరాబాద్‌ లో గోల్డ్ మెన్‌ ప్రత్యక్షం

 2l6r22j0 హైదరాబాద్‌: నగరంలో ఓ గోల్డ్ మెన్‌ ప్రత్యక్షమయ్యాడు. బంగారంతో దగదగ మెరుస్తున్న షర్టును ధరించిన ఆయన నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చారు. మహారాష్ర్ట యోలో పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పంకజ్‌ ఫరాక్‌ హిమాయత్‌నగర్‌లోని తన అన్నయ్య పదమ్‌ రాజు ఫరాక్‌ గృహప్రవేశానికి వచ్చాడు. నాలుగు కేజీల బంగారు షర్ట్, మూడు కేజీల బంగారు ఉంగరాలు, మెడలో చైన్‌, బంగారంతో తయారు చేసిన 30 గ్రాముల కళ్లజోడుతో ఫంక్షన్‌లో పంకజ్‌ ఫరాక్‌ తళుక్కున మెరిసిపోయారు. పంకజ్‌తో ఫొటోలు దిగేందుకు ఫంక్షన్‌లో చాలామంది ఉత్సాహపడ్డారు. చిన్నప్పటి నుంచి తనకు బంగారం అంటే ఎంతో ఇష్టమని పంకజ్‌ చెప్పారు. తన 45వ జన్మదినం సందర్భంగా బంగారు షర్ట్ కుట్టించడానికి రెండు నెలల సమయం పట్టిందని తెలిపారు. అంతేకాదు.. హైదరాబాద్‌ నగరమంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. లిమ్కా బుక్‌ రికార్డులో చోటు సంపాదించుకోవడం కోసం తాను మరిన్ని బంగారు ఆభరణాలను ధరిస్తానని చెబుతున్నారు.