హౌసింగ్‌ శాఖపై సమీక్ష: సీఎం

శ్రీకాకుళం: హౌసింగ్‌ శాఖపై పూర్తిగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు రావాల్సిన రుణాలపై కూడా జిల్లాలో పలు సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. తన పర్యటనలో హాస్టళ్లలో బస చేస్తున్నానని, అయితే రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులో ఒకరు సంక్షేమ హాస్టళ్లలో బస చేయాలని చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.