*అంకిత హత్య దారుణం నిందితులను ఉరితీయాలి*
*కళావతమ్మ డిమాండ్*
వనపర్తి సెప్టెంబర్ 25 (జనం సాక్షి)రిసార్ట్ కి వచ్చే అతిథులతో వ్యభిచరించేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో రిసార్ట్ రిసిప్షనిస్ట్ అంకిత బండారీ (19 )ని ఉత్తరాఖండ్ ప్రభుత్వ బోర్డు అధ్యక్షుడుగా క్యాబినెట్ హోదాలో పనిచేసిన హరిద్వార్ కు చెందిన బిజెపి నేత వినోద్ ఆర్య కొడుకు పులకిత్ ఆర్య ఆమెను బ్యారేజ్ లోకి త్రోసి హత్య చేయటం ఘోరమని ఈ కేసులో నిందితులను బహిరంగంగా ఉరితీయాలని జిల్లా అధ్యక్షులు పి కళావతమ్మ డిమాండ్ చేశారు. సంఘటనను ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో ఖండించారు ఉత్తరాఖండ్ పౌరి జిల్లా యమకేశ్వర్ లో ఈనెల 18న ఈ సంఘటన చోటు చేసుకున్నదని తెలిపారు. వ్యభిచారానికి అంగీకరించలేదన్న నెపంతో హత్య తొలిసారిగా వింటున్నామని తెలిపారు కాగా ఈ నెలలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు దళిత బాలికలు తమతో పెళ్లికి అంగీకరించలేదని వారిని హత్య చేసి శవాలను చెట్టుకు వేలాడదీశారని తెలిపారు ఈ సంఘటన మరువకముందే ఉత్తరాఖండ్లో అంకిత బండారి హత్య జరిగిందని తెలిపారు ఈ రెండు ఘటనలు జరిగిందీ బిజెపి పాలిత రాష్ట్రాలలోనేనని గుర్తు చేశారు. మహిళలను పూజించటం తమ సిద్ధాంతమని బిజెపి చెబుతుందని గుర్తు చేశారు తెలంగాణ లో ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఇద్దరి మైనర్ బాలికల
సామూహిక అత్యాచారం సంఘటనలు , గతంలో మహిళలు బాలికలపై అత్యాచారం హత్య పలు ఘటనలు మహిళా రక్షణలో ప్రభుత్వాల డొల్లతనాన్ని తెలియజేస్తున్నదని విమర్శించారు మహిళల కేసుల్లో నేరస్తులకు సత్వరం శిక్షలు పడేలా చట్టాలను న్యాయ వ్యవస్థలో మార్పులు తేవాలని డిమాండ్ చేశారు
ReplyForward
|