అంగన్వాడి కేంద్రంలో జన్మదిన వేడుకలు

గరిడేపల్లి, అక్టోబర్ 17 (జనం సాక్షి): మండల పరిధిలో ఉన్న గారకుంట తండా గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో గ్రామానికి చెందిన గుగులోతు సందీప్ నాయక్ సరిత దంపతుల ఏకైక కుమార్తె భాను శ్రీ నాయక్ జన్మదిన వేడుకలు అంగన్వాడి కేంద్రంలో పిల్లల నడుమ నిర్వహించారు. ప్రతి పిల్లలు జన్మదిన వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత, ఉపాధ్యాయులు గోవింద్, అంగన్వాడి టీచర్ కవిత, ఆయా లక్ష్మమ్మ, గ్రామ మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.