అంగన్వాడి భవనం నాదేనని గొడవ చేస్తున్న వ్యక్తి
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంగన్వాడి టీచర్
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 07, ( జనం సాక్షి ) :
మండలంలోని తాటికొండ గ్రామంలో గల ఒకటవ అంగన్వాడి సెంటర్ కు ప్రభుత్వం నూతన భవ నం నిర్మించి అంగన్వాడి సెంటర్ కు అప్పగించడం జరిగింది. ఈ అంగన్వాడి సెంటర్ ముందు గత కొద్ది రోజులుగా ఉంటున్న మారపాక ప్రభాకర్ అనే వ్యక్తి అంగన్వాడిభవనం తనదేనని అంటు గొడవ చేస్తుండడంతో గ్రామంలో ఎవరికిచెప్పినా స్పందిం చకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అంగన్వాడి టీచర్ పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని రోజు లుగా ప్రభాకర్ అనే వ్యక్తి అంగన్వాడీ వరండాలో ఉంటూ అక్కడే వండుకోవడం, స్నానం చేయడం, గోడలకు మేకులు కొట్టి పాత సంచులు తగిలించ డం చేస్తుండడంతో గ్రామ పెద్దలకు తెలపగా అతను మతి స్థిమితం లేని వ్యక్తి అని ఎవరు పట్టించుకోకపోవ డంతో గతంలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి అతడిని అక్కడి నుంచి పంపించారని అన్నారు.మళ్లీ కొద్దిరోజులుగా అంగ న్వాడి సెంటర్ ముందుఉంటూ పరిసరాలను అప రిశుభ్రంగా మారుస్తూ ఉండటంతో సెంటర్ కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారని, అనేక సార్లు అతడిని అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పి న వినకపో గా తిడుతున్నాడని, అతన్ని వెళ్లగొట్ట డానికి ఎవరు ముందుకు రాకపోవడంతో అతన్ని అంగన్వాడి సెంటర్ నుండి పంపించాలని కోరు తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింద న్నారు.