-->

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ టీచర్స్& హెల్పర్స్ అసోసియేషన్  జిల్లా గౌరవాధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి   ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.
 శుక్రవారం దేవరకొండ లో జరిగిన అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్  సమావేశం లో  దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వం  అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ను 40ఏళ్ల నుంచి  గౌరవ వేతనంతో పేరుతో పని చేపిస్తు అటు ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా,ఇటు కార్మికులు కాకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారని అన్నారు.
        గత ఐదు సంవత్సరాలుగా టీ ఏ _డి ఏ  బిల్లులు  ఇవ్వటం లేదు అని అన్నారు. ఇంటి అద్దెలు,వంట గ్యాస్ ,ఆరోగ్య లక్ష్మి బిల్స్  ఈవెంట్స్ బిల్స్ సక్రమంగా ఇవ్వకుండా  ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది  అని అన్నారు . కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రతి సంవత్సరం ఆ శాఖకు నిధుల కేటాయింపుల్లో కోత విధిస్తుందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 24000 ఇవ్వాలని కోరారు.
   విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్స్ ను  మెయిన్ సెంటర్ గా చెయ్యాలనీ ,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు గ్రాట్యుటీ వెంటనే వర్తింపజేయాలని ఆయన  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని  దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆగస్టు 28 వ తేదీన దేవరకొండ లో జరిగే జిల్లా మహాసభ ను జయప్రదం చేయాలని కోరారు.
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జున్న జయమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలపై రోజురోజుకు పని భారం పెరిగిపోతుందని ఆన్లైన్ పేరుతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గ్యాస్ ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని వాటికనుగుణంగా బిల్లు పెంచాలని కోరారు. చనిపోయిన అంగన్వాడీ టీచర్, ఆయా స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు.
      ఈ  కార్యక్రమం లో అంగన్వాడి యూనియన్ నాయకులు తిప్పర్తి మమత కే. మనెమ్మ, వి రాధిక,ఎన్ ప్రభావతి,రెనమ్మ,కవిత,స్వప్న,కే రెడ్డిబాయి,గోపిక,ఎం శ్రీదేవి,బి విజయలక్ష్మి,కవిత, ఉషారాణి, వినోద,అలివేలు, సుమిత్ర,భగ్యమ్మ,కమిలి,సాలమ్మ,స్వప్న,యాదమ్మ,ధనలక్ష్మి,సుశీల, పద్మ,శారద, విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
Attachments area