*అంగన్వాడీలపై అధికారుల వేధింపులు ఆపాలి*

మక్తల్ ఆగస్టు 02(జనంసాక్షి) మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లపై, ఆయాలపై అధికారుల వేధింపులు ఆపాలని IFTU జిల్లా అధ్యక్షుడు ఎస్. కిరణ్ అన్నారు. స్థానిక ఐ బి ఆవరణ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యూ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్, ఐ ఎఫ్ టి యూ జిల్లా ఉపాధ్యక్షులు ఏజీ భుట్టోమాట్లాడుతూ అంగన్వాడి టీచర్లపై ఆయాలపై అధికారుల తీవ్రమైన పని భారం మోపుతున్నారని అన్నారు. జాతీయ రాష్ట్ర పండుగలకు సెలవు దినాలు కూడా ఇవ్వడం లేదన్నారు. అంగన్వాడి భవనాలు లేక ప్రైవేటు ఇళ్లల్లో నిర్వహణ చేస్తున్నా ఇండ్లకు బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. ఆన్లైన్ చేయడం తదితర సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. సిలిండర్ పై వంటలు చేస్తున్నారు కానీ అధికారులు మాత్రం కట్టెలపోయేకి సంబంధించిన బిల్లులు చేస్తున్నారని అన్నారు. దీని వల్ల ఆర్థికంగా అంగన్వాడి టీచర్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి కానీ అంగన్వాడీలకు పాత టెండర్ల ప్రకారం నాటి ధరలకు అనుకూలంగా బిల్లులు చేస్తున్నారన్నారు. దీనివల్ల అంగన్వాడీ టీచర్లు కు అప్పులు పెరిగిపోతున్నాయని అన్నారు. అంగన్వాడి వర్కర్స్ కు కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఈశ్వరయ్య ,నాయకులు రాజు, లింగన్న