అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
హుజూర్ నగర్, సెప్టెంబర్ 23(జనం సాక్షి): పోషణ మాస వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం హుజూర్ నగర్ పట్టణం లోని 6,11,15,1,2 అంగన్వాడి కేంద్రాల గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషక ఆహారం పై అవగాహన సదస్సును నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంచార్జ్ సిడిపిఓ హేమదేవి, 10వార్డు కౌన్సిలర్ గుండా ఫణి కుమారి, 6 వ వార్డు కౌన్సిలర్ ములకలపల్లి రాంగోపి, 8వ వార్డ్ కౌన్సిలర్ చిలకబత్తిని సౌజన్య లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ హేమదేవి మాట్లాడుతూ ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అనంతరం పోషక ఆహార ప్రదర్శన నిర్వహించి గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు, గర్భిణీ స్ర్తీలు, బాలింతలు తల్లులు, పిల్లలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.