అంగన్‌వాడీ మహిళల ధర్నా
ఏలూరు, జూలై 16 : అంగన్‌వాడీ మహిళలు కలెక్టరేట్ వద్ద సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. వేతనాల పెంపుదల, ఇతర డిమాండ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎవ్వరినీ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మహిళల ధర్నాతో కలెక్టరేట్ ఆవరణ దద్దరిల్లింది.