అంగరంగ వైభవంగా అమ్మవారికి కుంకుమ పూజ అభిషేకం.

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్: 28  దసర నవరాత్రుల మహోత్సవ భాగంగా మూడవరోజు న మండల కేంద్రంలోని దుర్గాదేవి  ఆలయంలో బుధవారం అమ్మవారికి అభిషేకం , సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అర్చకులు కృష్ణ ప్రసాద్ శర్మ , సొంతోష్ శర్మ , కమిటీ సభ్యులు తోట రవీందర్ , తెలు రాజేష్ , ముష్కరి రాకేష్ , బండి జైపాల్ , మద్దనపల్లి రాజ్ కుమార్ , ముష్కరి రాజు కుమార్ , ముష్కరి సురేందర్ , ఏనుగు జీవన్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.